: 'పాకిస్థాన్ జిందాబాద్' అంటే ఖండఖండాలుగా కోస్తా: బెంగాల్ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
"ఇండియాలో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసినవారి తలలు నరుకుతా. వారిని ఖండఖండాలుగా చేస్తా" అంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ శివాలెత్తి పోయారు. సియురిలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఓ విద్యార్థి తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేయగా, వాటిని ప్రస్తావించిన దిలీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉంచితే, ఇక్కడి బీర్భూమ్ జిల్లాలోని ఈలంబజార్, దుబ్రాజ్ పూర్ ప్రాంతాల్లో జరిగిన హింసాకాండలో భాగంగా, ఓ పోలీసు స్టేషన్ పై దాడి జరిగింది. స్టేషన్ ధ్వంసం చేసి, అక్కడి పలు వాహనాలను తగులబెట్టిన నిరసనకారులు దారిన పోతున్న వారిపైనా దాడులు చేసినట్టు తెలుస్తోంది. గురిషా ప్రాంతంలో ఓ వర్గానికి చెందిన కొందరు హిందూ ఇళ్లపై దాడులకు దిగారని బీర్ భూమ్ బీజేపీ జిల్లా కమిటీ పాంప్లెట్లు పంచింది. షాపులను లూటీలు చేస్తున్నారని, ప్రజలు తగు జాగ్రత్తల్లో ఉండాలని ఆ కరపత్రాలలో హెచ్చరించింది.