: 10వ తేదీలోపు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే మళ్లీ దీక్ష చేపడతా: ముద్రగడ పద్మనాభం


ఈ నెల 10వ తేదీ లోపు ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆరు హామీలను నిలబెట్టుకోవాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ గడువు తేదీలోగా పరిష్కరించని పక్షంలో ఈ నెల 11 నుంచి మళ్లీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని అడగటం తప్పా? మా సమస్యలను పరిష్కరించమని అడగటం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. కులపోరాటాలను అణచివేస్తామని ప్రభుత్వం చెబుతుండటం ఎంత వరకు సబబు అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News