: అణ్వాయుధాలు సిద్ధం చేయండి: ఉత్తర కొరియా అధ్యక్షుడి ఆదేశాలతో ఉద్రిక్తత


"అణ్వాయుధాలను సిద్ధం చేయండి. వార్ హెడ్స్ బిగించండి. ఏ క్షణమైనా ఉపయోగించాల్సి రావచ్చు" అని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్ ఆదేశించినట్టు కేసీఎన్ఏ న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. కొరియన్ పెనిన్సులాలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయని భావిస్తున్న ఆయన, ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండాలని వ్యాఖ్యానించినట్టు ఉత్తర కొరియా అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు సాధారణమేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, మరింత శక్తిమంతమైన మల్టిపుల్ రాకెట్ లాంచర్ ను స్వయంగా పరీక్షించిన కిమ్ జాంగ్, ఆపై అణ్వాయుధాల గురించిన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న కొరియా దేశాల సంబంధాలు, ఈ తరహా చర్యలతో మరింత తెగుతాయన్న ఆందోళనా నెలకొంది.

  • Loading...

More Telugu News