: నడిగర్ సంఘంలో అక్రమాలు... మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్ పై ఫిర్యాదు
దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం (నడిగర్ సంఘం)లో అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలని ప్రస్తుత ఆఫీస్ బేరర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటుడు శరత్ కుమార్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, సంఘం నిర్వహిస్తున్న ట్రస్ట్ కేంద్రంగా భారీ అవినీతి జరిగిందని, ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పూచ్చి మురుగన్ నేతృత్వంలో చెన్నై పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ట్రస్ట్ నిధులు కాజేసిన శరత్ కుమార్ తదితరులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రాథమిక విచారణ అనంతరమే కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.