: కోటప్పకొండకు నేడు చంద్రబాబు... వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనుల పరిశీలన
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మరికాసేపట్లో జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు ఆయన వెళ్లనున్నారు. కోటప్పకొండలో కొత్తగా ఏర్పాటు కానున్న కాపు సత్రానికి ఆయన భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత అక్కడే పలు అభివృద్ది కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టనున్నారు. కోటప్పకొండ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత అటు నుంచి అటే నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడికి బయలుదేరతారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల పరిశీలన కోసమే చంద్రబాబు వెలగపూడి వెళుతున్నారు. అనంతరం ఆయన తిరిగి విజయవాడ చేరుకుంటారు.