: షార్ లో చోరీ!...ఎస్సార్సీలో విలువైన వస్తువుల తస్కరణ, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక భూమిక పోషిస్తున్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షార్ లోకి గుట్టుచప్పుడు కాకుండా చొరబడ్డ దుండగులు ఎస్సార్సీలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. కేంద్ర బలగాల నిఘా నీడలో పటిష్ట భద్రత కలిగిన షార్ లోకి ఇతరులు ప్రవేశించడం దాదాపుగా దుర్లభమే. అయితే గట్టి నిఘాను కూడా బద్దలు కొట్టిన దుండగులు షార్ లోకి ఎంటరయ్యారు. విలువైన వస్తువులను మూడో కంటికి తెలియకుండా ఎత్తుకెళ్లారు. చోరీ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన షార్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.