: అమెరికాలో సత్తా చాటుతున్న కేశినేని కుమార్తె... హిల్లరీ ప్రచార బృందంలో కీలక భూమిక
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేశినేని శ్రీనివాస్ (నాని) విజయం వెనుక టీడీపీ కార్యకర్తలతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది. కేశినేని రెండో కూతురు శ్వేత చౌదరి తన తండ్రి తరఫున బెజవాడ పరిధిలో విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. తండ్రి విజయం సాధించారు. బెజవాడలో అప్పటిదాకా నిలిచిపోయిన అభివృద్ధికి కేశినేని కొత్త జవసత్వాలు నింపారు. తండ్రి విజయంలో కీలక భూమిక పోషించిన శ్వేత... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ కీలకంగా వ్యవహరించనున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన హిల్లరీ క్లింటన్ తరఫున జరగనున్న ప్రచారంలో శ్వేత కీలక భూమిక పోషించనున్నారు. విద్యాభ్యాసం కోసమే అమెరికా వెళ్లిన శ్వేత... అక్కడ పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలో హిల్లరీ దృష్టిని ఆకర్షించిన శ్వేత... అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ప్రచార బృందంలో సభ్యురాలిగా ఎంపికయ్యారు.