: యూఏఈపై భారత్ విజయం
భారత్-యూఏఈ టీ20 మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 59 బంతులు మిగిలి ఉండగానే భారత్ తన స్వల్ప లక్ష్యాన్ని సాధించింది. 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి తన లక్ష్యం కంటే ఒక్క పరుగు ఎక్కువగానే టీమిండియా చేసింది. కాగా, వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఆసియా కప్ టీ20 ఫైనల్ కు చేరుకుంది. ధావన్ 16, యువరాజ్ సింగ్ 25 పరుగులు చేశారు. ఈ నెల 6న భారత్-బంగ్లాదేశ్ మధ్య ఆసియాకప్ తుదిపోరు జరగనుంది.