: జేఎన్యూ విద్యార్థి కన్నయ్య విడుదల


దేశ వ్యతిరేక నినాదాలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టయిన జేఎన్యూ విద్యార్థి కన్నయ్య కుమార్ ను తీహార్ జైలు నుంచి ఈరోజు విడుదల చేశారు. నిన్న కన్నయ్యకు ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరైంది. కాగా, గత నెల 9న జేఎన్యూ లో విద్యార్థులు ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడ్డ అఫ్జల్ గురుకి అనుకూలంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై కన్నయ్య కుమార్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహం కేసులో కొన్ని రోజులుగా జైలులోనే ఉన్న కన్నయ్యను ఈ రోజు విడుదల చేశారు.

  • Loading...

More Telugu News