: బ్యాంకు అప్పు తీర్చనందుకు... సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కార్యాలయం సీజ్
హైదరాబాద్ ఫిలింనగర్ లోని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కార్యాలయాన్ని బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. కోటక్ మహీంద్ర బ్యాంకు నుంచి సురేష్ తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆయన కార్యాలయానికి తాళం వేశారు. సోమాజిగూడ బ్రాంచిలో బెల్లంకొండకు రూ.11 కోట్ల అప్పు ఉన్నట్లు బ్యాంకు అధికారుల సమాచారం. కాగా, బెల్లంకొండ సురేష్ ప్రొడక్షన్ మేనేజర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగారు. అగ్రహీరోలతో పలు చిత్రాలను ఆయన నిర్మించిన విషయం తెలిసిందే.