: రోబో డాగ్- బుజ్జికుక్క మధ్య స్నేహం కుదర్లేదు!
ప్రముఖ సంస్థ గూగుల్ రూపొందించిన రోబో డాగ్ కు, నిజమైన కుక్కకు మధ్య స్నేహం కుదర్చాలన్న శాస్త్రవేత్తలకు నిరాశే ఎదురైంది. గూగుల్ రోబో డాగ్ 'స్పాట్' వద్దకు నిజమైన కుక్క ఫిడో వస్తున్న కొద్దీ గట్టిగా అరుస్తూ దానిని తరిమికొట్టేందుకు ప్రయత్నించిన విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. కాగా, అమెరికా సైనిక అవసరాల నిమిత్తం ఈ రోబో డాగ్ ను రూపొందించారు. ఇది గట్టిగా అరవడమే కాకుండా, మన ఆదేశాలను పాటిస్తుంది కూడా. బోస్టన్ లోని గూగుల్ కు చెందిన డైనమిక్స్ సంస్థ దీనిని రూపొందించింది.