: ఐఎస్ఐఎస్ మరో దురాగతం... ఖైదీలను చంపి నదిలో పడేస్తున్నారు!
ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ దురాగతాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఇరాక్, సిరియాల్లో దారుణ హత్యలకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్, ఇరాక్ లో తన అధీనంలో ఉన్న మొసూల్ నగరంపై కుర్దులు, ఇరాకీ సేనలు విరుచుకుపడుతుండడంతో తమ వద్ద బందీలుగా ఉన్న ఖైదీలను హతమార్చడం మొదలుపెట్టింది. ఇరాక్ లోని మొసూల్ లోని జైళ్లలో ఉన్న ఖైదీలను పెద్దఎత్తున హతమార్చి, ఆ శవాలను పక్కనే ఉన్న టైగ్రిస్ నదిలో పారేసిందని సమాచారం. ఇందులో కొంత మంది ఖైదీలను సిరియాలోని అల్ రకా నగరానికి మార్చింది. వీరి కుటుంబ సభ్యులతో బేరసారాలు జరిపి డబ్బు సంపాదించాలని ఐఎస్ఐఎస్ భావిస్తోంది.