: తెరపైనే హీరోని.. ఇంట్లో మామూలు మనిషినే!: షారూఖ్ ఖాన్
వైవిధ్యభరితమైన కథలతో కూడిన సినిమాల్లో నటిస్తూ, దేశవిదేశాల్లో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న షారూఖ్...ఇంట్లో మాత్రం సాధారణమైన వ్యక్తిలా ఉంటాడట. సూపర్ స్టార్ అన్న ఇమేజ్ కారణంగా తెరపై తాము ఏం చేసినా ప్రత్యేకంగా చూస్తారు తప్ప, బయట తాము కూడా సాధారణ వ్యక్తులమేనని అన్నాడు. ప్రేమికుడిగా, ఆవేశపరుడిగా, మానసికవ్యాధిగ్రస్తుడిగా, డాన్ గా ఇలా పాత్రను బట్టి సినిమాల్లో నటిస్తానని షారూఖ్ చెప్పాడు. అవన్నీ కథానుసారమే ఉంటాయని స్పష్టం చేశాడు. దర్శకుడు వచ్చి కథ చెప్పి ఎలా నటించాలని కోరితే అలాగే నటిస్తానని అన్నాడు. తెరపైనే హీరోనని, ఇంట్లో మామూలు మనిషినేనని షారూఖ్ స్పష్టం చేశాడు.