: చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యాపారలావాదేవీలు లేవు: ఎంపీ మురళీమోహన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో తనకు ఎటువంటి వ్యాపారలావాదేవీలు లేవని ఎంపీ మురళీమోహన్ స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి భూదందా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన స్పందించారు. విజయవాడలో ఏడు ఎకరాలు మాత్రమే తాను కొనుగోలు చేశానని చెప్పారు. బినామీ పేర్లతో తాను భూములు కొనుగోలు చేశానని సాక్షి పత్రిక తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యాపారలావాదేవీలు లేవని, ఒకవేళ ఉన్నట్టు నిరూపిస్తే అసెంబ్లీ ఎదుట ఉరి వేసుకుంటానని గతంలోనే చెప్పానని అన్నారు. వైఎస్ఆర్, పీజేఆర్ లు కూడా తనపై నాడు ఆరోపణలు చేశారని, కానీ, నిరూపించలేకపోయారని అన్నారు. 1993 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, వివాదాలు ఉన్న భూములను తానెప్పుడూ కొనలేదని మురళీమోహన్ చెప్పారు.