: స్వల్పంగా పెరిగిన మారుతి కార్ల ధరలు


ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా (ఎమ్ఎస్ఐ) కార్ల ధరలు స్వలంగా పెరిగాయి. ఈమేరకు ఎమ్ఎస్ఐ ఈరోజు ఒక ప్రకటన చేసింది. 2016-17 కేంద్ర బడ్జెట్ లో కొత్తగా ప్రవేశపెట్టిన మౌలిక సదుపాయాల సెస్ కారణంగా కార్ల ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. ఆయా మోడళ్లను అనుసరించి కార్ల ధరలు రూ.1,441 నుంచి గరిష్టంగా రూ.34,494 వరకు పెరిగినట్లు పేర్కొంది. కాగా, సియజ్ ఎస్ హెచ్ వీఎస్, ఎర్టిగా ఎస్ హెచ్ వీఎస్ మోడళ్ల కార్లు మౌలిక సదుపాయాల సెస్ పరిధిలోకి రావని, అందువల్ల వాటి ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదని ఎమ్ఎస్ఐ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News