: సినీ హాస్యనటుడు ధనరాజ్ గృహప్రవేశం
ప్రముఖ హాస్యనటుడు ధనరాజ్ నూతన గృహ ప్రవేశం చేశాడు. హైదరాబాద్ లోని పంచవటి కాలనీలో నూతన గృహాన్ని ఆయన నిర్మించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫంక్షన్ కు కామెడీ లెజెండ్ బ్రహ్మానందం, అలీతో బాటు పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనరాజ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ ఫంక్షన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో అభిమానులు వాటిని షేర్ చేసుకుంటున్నారు.