: రష్మి 'జబర్దస్త్' కామెంట్స్
ఒకట్రెండు సినిమాల్లో నటించిన తరువాత సరైన అవకాశాలు రాకపోవడంతో యాంకర్ అవతారమెత్తిన రష్మికి 'జబర్దస్త్' టీవీ షోతో పాప్యులారిటీ లభించింది. దీనిని ఆధారం చేసుకుని సినీ తారగా వెలుగొందేందుకు రష్మికి మరోసారి 'గుంటూరు టాకీస్' సినిమా ద్వారా అవకాశం వచ్చింది. దీంతో, ఈ ఆవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా సంచలన వ్యాఖ్యలతో సినిమా ప్రమోషన్, పనిలో పనిగా వ్యక్తిగతంగా తన ప్రమోషన్ కూడా చేసుకుంటోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'ఇది అడల్ట్ సినిమా' అని చెప్పి నాలిక కరుచుకున్న రష్మి, ఆ తర్వాత తేరుకుని, 'అందరూ అనుకునే టైపు అడల్ట్ సినిమా కాదులెండి' అని సరిదిద్దుకుంది. తాజాగా ఈ సినిమాలోని లిప్ లాక్స్, ఘాటు సీన్లపై మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సిద్దూతో డేటింగ్ లో ఉన్నానని చెప్పింది. అందుకే తమ ఇద్దరి మధ్య తీసిన రోమాంటిక్ సీన్లు అంత బాగా పండాయని బిల్డప్ ఇచ్చింది. మొత్తానికి రష్మి హాట్ వ్యాఖ్యలతో సినిమాకి, తనకి మంచి ప్రమోషన్ ఇచ్చుకుంటోంది. మరి ఈ వ్యాఖ్యలు ఎన్ని అవకాశాలు తెస్తాయో చూడాలి!