: జేబుదొంగ చూపు జేబుల మీద...జగన్ చూపు భూముల మీద: పయ్యావుల


జేబు దొంగ చూపు జేబుల మీద .. జగన్ చూపు భూముల మీదా ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర రాజధానిలో భూదందాకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. జగన్ దొనకొండ వద్ద భూములు కొనుగోలు చేశారని, అక్కడ రాజధాని రాలేదనే అక్కసుతోనే అధికార పార్టీ నేతలపై ఆయన బురద చల్లుతున్నారని ఆరోపించారు. రాజధానిలో భూములు కొనుగోలు చేయడం తప్పు కాదని, ముందస్తు సమాచారంతో కొంటే మాత్రం తప్పని అన్నారు. అసెంబ్లీలో సెప్టెంబర్ 4న ప్రకటన చేస్తే అక్టోబరు-నవంబరు మధ్య తాను భూములు కొనుగోలు చేశానని చెప్పారు. తాను రైతు బిడ్డనని, తనకు సంబంధించినంత వరకు భూమి అనేది భావోద్వేగంతో కూడుకున్నదని అన్నారు. రాజధాని ప్రాంతంలో తన కొడుకు పేరుమీద భూమి కొనుగోలు చేశానని.. అందుకు సంబంధించిన అఫిడవిట్లు ఉన్నాయన్నారు. అయితే, జగన్ మాదిరిగా బినామీ బతుకు తాను బతకటం లేదని.. జగన్ కు బెంగళూరులో ఉన్న ప్యాలెస్, సాక్షి పత్రిక, బిల్డింగ్... అవన్నీ బినామీ పేర్ల మీదే ఉన్నాయని పయ్యావుల విమర్శించారు.

  • Loading...

More Telugu News