: జగన్.. నీ బతుకే ఒక బినామీ బతుకు: ఎమ్మెల్యే నరేంద్ర
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బతుకే ఒక బినామీ బతుకని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఉండే నివాసం, ఆయన ఉపయోగించే కార్లు అన్నీ బినామీవేవని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారంటూ పిచ్చి రాతలు రాయిస్తున్న జగన్ పై ఆయన మండిపడ్డారు. అయినా, రాజధాని ప్రాంతంలో కుటుంబసభ్యుల పేరిట భూములు కొనుగోలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో వైఎస్సార్సీపీ నేతలు కూడా భూములు కొనుగోలు చేశారని... ఆ విషయాలను సాక్షి ఛానల్, సాక్షి న్యూస్ పేపర్ లో ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వైఎస్సార్సీపీ నేతల చిట్టా తన వద్ద ఉందని, త్వరలోనే బయటపెడతానని నరేంద్ర అన్నారు.