: తెలంగాణలో లబ్ధిదారులకు రేషన్ సరుకుల ఎస్ఎంఎస్ సందేశం
తెలంగాణలో రేషన్ సరుకులను లబ్ధిదారులు సకాలంలో ఇంటికి తీసుకువెళ్లేందుకు వీలుగా ఆయా డీలర్లు ఫోన్ ఎస్ఎంఎస్ ల ద్వారా వారికి తెలియజేస్తున్నారు. ప్రయోగాత్మకంగా సర్కిల్-7 ఖైరతాబాద్ పరిధిలోని రేషన్ డీలర్లు ఈ నెలకు సంబంధించిన సరుకుల వివరాలను లబ్ధిదారులకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం అందించారు. త్వరలోనే తొమ్మిది సర్కిళ్లలో ఈ పద్ధతిని అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, రేషన్ డీలర్లు సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.