: జగన్ నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా: మంత్రి రావెల
నవ్యాంధ్ర రాజధానిలో తనకు భూములు ఉన్నాయని జగన్ నిరూపిస్తే కనుక తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతుండటంతో నైరాశ్యంలో ఉన్న జగన్.. ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గత పదేళ్ల నుంచి తన భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని చెప్పారు. తాము అక్రమ లావాదేవాలు చేయలేదని, తమకు బినామీ ఆస్తులు లేవని అన్నారు. అక్రమాస్తులు ఉన్నాయని నిరూపిస్తే వార్త రాసిన వారికే వాటిని ఇచ్చేస్తానని రావెల అన్నారు.