: మోదీ, చంద్రబాబులది దగా జోడి!... రఘువీరా ఘాటు వ్యాఖ్య


ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి నేటి ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కోసమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. అంతకుముందు అక్కడి మీడియాతో మాట్లాడిన సందర్భంగా రఘువీరా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసం చేస్తోంటే, దానికి సీఎం నారా చంద్రబాబునాయుడు వంత పాడుతున్నారని ఆరోపించారు. మోదీ, చంద్రబాబుల ద్వయం దగా జోడీగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News