: ఫ్రెంచ్ ఓపెన్ లో గెలవాలంటే తీవ్రంగా శ్రమించాలి: సానియా మీర్జా
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో విజయం సాధించాలంటే తీవ్రంగా శ్రమించాలని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిప్రాయపడింది. సానియా-హింగిస్ జోడీ ఇప్పటికే వరుస విజయాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే, ఎర్రమట్టిపై ఆడే ఫ్రెంచ్ ఓపెన్ లో నెగ్గడం అంత తేలిక కాదని.. క్లే కోర్టులు తనకు అంతగా అచ్చిరావని ఆమె పేర్కొంది. తమ జోడీ ఇప్పటికే వరుసగా మూడు గ్రాండ్ స్లామ్స్ సాధించిందని, ఇదే జోరు ఫ్రెంచ్ ఓపెన్ లో కూడా కొనసాగాలని అనుకుంటున్నట్లు సానియా చెప్పింది. కాగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న సానియా-హింగిస్ జోడీ గతవారం కతార్ ఓపెన్ లో పరాజయం పాలైంది.