: ఇంటర్ పరీక్షలు... ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ!
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించకపోవడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని మౌలానా ఆజాద్ కాలేజ్ లో ఈ రోజు జరుగుతున్న పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. తమ ఇంటి వద్ద ఎంత ముందుగా బయలుదేరినప్పటికీ ... ట్రాఫిక్ జామ్ లేదా ఇతర కారణాల వలన కొంత ఆలస్యమవుతోందని వారు వాపోతున్నారు. ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదన్న అధికారుల నిబంధనలు విద్యార్థులకు తలనొప్పిగా తయారయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్షా కేంద్రం లోకి తనను అనుమతించేందుకు సహకరించాలంటూ అక్కడ ఉన్న విలేకరులకు ఒక విద్యార్థిని విజ్ఞప్తి చేసింది.