: నటి ప్రేమ పెళ్లి పెటాకులైంది!... విడాకుల కోసం బెంగళూరు కోర్టును ఆశ్రయించిన ప్రేమ


దక్షిణాది భాషా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నటి ప్రేమ పెళ్లి పెటాకులే అయ్యింది. కొంతకాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ప్రేమ చాలా తొందరగానే పెళ్లి చేసేసుకుంది. పారిశ్రామికవేత్త జీవన అప్పచ్చును 2006లో పెళ్లి చేసుకున్న ప్రేమ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కు వీడ్కోలు పలికింది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న ప్రేమ నిన్న హఠాత్తుగా ఫ్యామిలీ కోర్టులో ప్రత్యక్షమైంది. తనకు విడాకులు కావాలంటూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భర్తతో విభేదాలు రావడంతో ప్రేమ ఇప్పటికే విడిగా ఉంటోంది. తన భర్తతో ఏర్పడ్డ అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరిన ఆమె, పరస్పర అంగీకారంతోనే పిటిషన్ వేస్తున్నట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News