: వర్మ పరిచయం... 'వంగవీటి' రత్నకుమారి ఈమే!
విజయవాడలో గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో తాను తీయతలపెట్టిన 'వంగవీటి' చిత్రంలో హీరోయిన్ ను రాంగోపాల్ వర్మ తొలిసారిగా పరిచయం చేశాడు. ఈ చిత్రంలో వంగవీటి మోహనరంగా భార్య రత్నకుమారి పాత్రను పోషించేందుకు నైనా గంగూలీని ఎంపిక చేసినట్టు తెలిపాడు. రంగా మరణం తరువాతనే బయటి ప్రపంచానికి పరిచయమైన ఆమె, అంతకుముందు కుటుంబంలో పడ్డ భావోద్వేగాలను నైనా కళ్లకు కట్టేలా చూపించగలదన్న నమ్మకం ఉందని వర్మ అంటున్నాడు. కాగా, ఇటీవల వర్మ విజయవాడకు వెళ్లినప్పుడు రత్నకుమారి అపాయింట్ మెంట్ కోరినప్పటికీ, ఆమె నిరాకరించిన సంగతి తెలిసిందే.