: పచ్చ చొక్కాలకే కాపు రుణాలు!: ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు


చంద్రబాబు ప్రభుత్వంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష పోరుకే సిద్ధమైనట్లున్నారు. నేటి ఉదయం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా తన దీక్ష విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను ఏం చేశారని ప్రశ్నించిన ముద్రగడ... తమ సామాజిక వర్గం సంక్షేమం కోసమంటూ ప్రారంభించిన కాపు కార్పొరేషన్ నిధులు ఓ వర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన 'పచ్చ చొక్కాలకే కాపు రుణాలు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు కార్పొరేషన్ రుణాలన్నింటినీ టీడీపీకి చెందిన వారికే ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం తాము చేపట్టిన కాపు ఐక్య గర్జనకు హాజరైన కాపుల్లో ఒక్కరికి కూడా రుణాలు మంజూరు కాలేదని ఆయన వాపోయారు. గర్జనకు హాజరైన వారికి రుణాలివ్వకపోగా, కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని కూడా ముద్రగడ ఆరోపించారు.

  • Loading...

More Telugu News