: అమెరికా ప్రైమరీల ఎన్నికల్లో ఏ రాష్టంలో ఎవరు గెలిచారంటే...!


బరాక్ ఒబామా పదవీ విరమణ తరువాత అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవుతారా? లేదా తొలిసారిగా ఓ మహిళగా హిల్లరీ క్లింటన్ కు పీఠం దక్కుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. సూపర్ ట్యూస్ డే ప్రైమరీ ఎన్నికల్లో వీరిద్దరూ తమ ప్రత్యర్థుల కన్నా ముందు నిలిచి, తుది బరిలో తామే ఉంటామని తేల్చేశారు. మొత్తం 10 రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన రిపబ్లికన్లు, డెమొక్రాట్ ఓటర్లు అధ్యక్ష బరిలో నిలిచేందుకు పోటీలో ఉన్న వారిని ఎంచుకున్నారు. అలస్కాలో రిపబ్లికన్లు, కొలరాడోలో డెమోక్రాట్లు తమ అభ్యర్థులను ఎంచుకున్నారు. రిపబ్లికన్ల తరఫు అభ్యర్థి ట్రంప్ మూడు స్థానాల్లో ఒటమిని చవిచూసి, మిగతా ఏడు చోట్ల విజయం సాధించి ముందు నిలిచారు. అలబామా, అలస్కా, ఆర్కాన్సస్, జార్జియా, మసాచుసెట్స్, తెన్నిస్సీ, వెర్ మాంట్, వర్జీనియా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా, ఒక్లహామా, టెక్సాస్ లలో టెడ్ క్రజ్, మిన్నెసోటాలో రుబియో గెలిచారు. ఇక డెమొక్రాట్ల విషయానికి వస్తే, అలబామా, ఆర్కాన్సస్, జార్జియా, మసాచుసెట్స్, తెన్నెస్సీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో విజయం సాధించిన హిల్లరీ, వెర్ మాంట్ం కొలరాడో, ఓక్లహామాలో ఓడిపోయారు.

  • Loading...

More Telugu News