: భారత రైల్వేల వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఉగ్రవాదులు


ఇండియన్ రైల్వేస్ నిర్వహిస్తున్న మైక్రో సైట్ 'రైల్ నెట్'ను అల్ ఖైదా ఉగ్రవాదులు హ్యాక్ చేశారు. కేంద్ర రైల్వేల్లో భాగమైన భుసావల్ డివిజన్ పర్సనల్ విభాగం నిర్వహించే సైట్ పేజీలను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు, దక్షిణాసియా అల్ ఖైదా చీఫ్ మౌలానా అసీమ్ ఉమర్ సందేశాన్ని అక్కడ ఉంచారు. "మీ సముద్రంలో ఎలాంటి తుపానూ లేదెందుకు? మౌలానా అసీమ్ ఉమర్ నుంచి భారత ముస్లింలకు ఓ సందేశం..." అంటూ సాగిందా మెసేజ్. హాక్ అయిన సైట్ లో మొత్తం 11 పేజీల డాక్యుమెంట్ ను ఉంచారు. "భారత ముస్లింలు మరచిపోయిన జీహాద్ పాఠాలను నేర్పి వారిని యుద్ధ రంగానికి కదిలేలా చేయగల వారెవరు?... బాలాకోట్ లో చిందిన రక్తానికి ప్రతీకారం ఎవరు తీర్చుకోవాలి?..." అంటూ ఉగ్రవాదం వైపు మళ్లించేలా సాగిందీ డాక్యుమెంట్. కాగా, ఉమర్ అలియాస్ సనౌల్ హక్, యూపీ పరిధిలోని సంభల్ వాసి. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత ప్రతీకారేచ్ఛతో ఉగ్రవాదుల్లో కలిసిపోయాడు. 1995 నుంచి ఉమర్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో నిఘా వర్గాలకు తెలియదు. గత సంవత్సరంలో భారత ఉపఖండానికి అల్ ఖైదా విభాగం చీఫ్ గా ఉమర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News