: అరగంటలో స్పీడ్ బ్రేకర్లు తొలగించేలా చేసిన నాగార్జున: వంశీ పైడిపల్లి


ఊపిరి చిత్రంలో ఏదైనా అద్భుతం ఉంది అంటే అది నాగార్జున, కార్తీలేనని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి నాగార్జున, కార్తీలిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతో ఆప్యాయంగా ఉన్నారన్నారు. ఎంత ఆప్యాయంగా ఉన్నారని చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ‘అన్నపూర్ణ ఏడెకరాల్లో ఊపిరి చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో నాగార్జున అక్కడికి వచ్చారు. ఏమిటి కార్తీ, సైక్లింగ్ చేస్తున్నావా? అని ప్రశ్నించారు. అందుకు కార్తీ లేదని సమాధానమిచ్చాడు. ఎందుకంటే, ఇక్కడన్నీ స్పీడు బ్రేకర్లు ఉన్నాయని చెప్పాడు. అంతే, వెంటనే సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి చెప్పి.. అరగంటలో వాటిని తొలగించేలా నాగార్జున చేశారు. నాగార్జున, కార్తీల మధ్య బాండింగ్ కు ఇంతకన్నా నిదర్శనమేముంటుంది’ అని వంశీ పైడిపల్లి అన్నారు.

  • Loading...

More Telugu News