: టీమిండియాను ఆదిలోనే దెబ్బ కొట్టిన కులశేఖర
టీమిండియాను ఆదిలోనే శ్రీలంక పేసర్ కులశేఖర దెబ్బతీశాడు. ఆసియాకప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీట్వంటీ మ్యాచ్ లో 139 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. గాయాల నుంచి కోలుకున్న టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ (1), రోహిత్ శర్మ (15)ను అద్భుతమైన బంతులతో కులశేఖర పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో కేవలం నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లిద్దరూ పెవిలియన్ బాటపట్టడంతో కోహ్లీ, రైనా బ్యాటింగ్ కు వచ్చారు. ఇద్దరూ వస్తూనే చెరో ఫోర్ బాది తమ ఉద్దేశం చాటారు.