: మావయ్యతో సినిమా చేశాను కానీ ఆడలేదు: సుమంత్
మావయ్య నాగార్జునతో ఒక సినిమా చేశాను కానీ అది ఆడలేదని నటుడు సుమంత్ చెప్పాడు. 'ఊపిరి' ఆడియో వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నాడు. ఈ సినిమాలో మగాళ్లను ఆడాళ్లు ఆటపట్టించే ఓ డైలాగ్ ఉందని, దానిని భరించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమయిపోవాలని సుమంత్ హెచ్చరించాడు. మావయ్య ఎప్పట్లాగే అందంగా కనిపించారని, ఆయన నటన గురించి కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదని అన్నాడు. తెలుగు పరిశ్రమలోకి నేరుగా వస్తున్న కార్తీకి శుభాకాంక్షలని సుమంత్ చెప్పాడు.