: ఆకట్టుకున్న శ్రీలంక... టీమిండియా విజయ లక్ష్యం 139


ఆసియా కప్ లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక ఆకట్టుకుంది. జోరుమీదున్న టీమిండియాను లంకేయులు ఎలా అడ్డుకుంటారోనన్న అనుమానాలు వ్యక్తమయినప్పటికీ, టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. ఓపెనర్ చండిమాల్ (4) ను ఆరంభంలోనే నెహ్రా పెవిలియన్ బాటపట్టించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన జయసూరియ (3)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. అనంతరం తొలి ఓవర్ వేసిన హార్డిక్ పాండ్య చక్కని బంతితో దిల్షాన్ (18) ను అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక ఇబ్బందుల్లో పడ్డట్టు కనిపించింది. అనంతరం ఈ దశలో కపుగెదర (30), మాథ్యూస్ (18) చక్కని భాగస్వామ్యంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. బుమ్రా మరోసారి లంకను దెబ్బ కొట్టడంతో మాథ్యూస్ బౌల్డయ్యాడు. అనంతరం వచ్చిన సిరివర్థనే (22) చక్కని బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అతనిని అశ్విన్ పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో రెండు చక్కని భాగస్వామ్యాలు నెలకొన్నాయి. అనంతరం క్రీజులోకి వచ్చిన శనక (1) వస్తూనే రనౌట్ గా వెనుదిరిగాడు. పెరీరా (17)ను అశ్విన్ వెనక్కి పంపగా, కులశేఖర (13) రన్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రా, పాండ్య చెరి రెండేసి వికెట్లు తీయగా, నెహ్రా ఒక వికెట్ తీసి వారికి సహకరించాడు. కాసేపట్లో 139 పరుగుల విజయ లక్ష్యంతో భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News