: నాగార్జున నవ్వు బాగుంటుంది : దర్శకుడు రాఘవేంద్రరావు
నాగార్జున ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని, ఆయన నవ్వు చాలా బాగుంటుందని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. 'ఊపిరి' చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు మాట్లాడుతూ, శివ సినిమా సమయంలో నాగార్జున చాలా కోపంగా చూసేవాడని అన్నారు. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని రాఘవేంద్రరావు అన్నారు.