: ‘ఊపిరి’ ఆడియో వేడుక షురూ
‘ఊపిరి’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో మొదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ హీరోలు నాగార్జున, కార్తీ, హీరోయిన్ తమన్నా నటిస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, నాగార్జున, కార్తీ, ప్రకాష్ రాజ్, దర్శకుడు రాఘవేంద్రరావు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.