: జేఎన్ యూ గురించి నేను చెప్పినవన్నీ నిజమే.. త్వరలో నిరూపిస్తా: బీజేపీ ఎమ్మెల్యే


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎస్ యూ) గురించి గతంలో తాను చెప్పిన విషయాలన్నీ నిజమేనని... త్వరలో నిరూపిస్తానని.. ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తానని రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా పేర్కొన్నారు. అల్వార్ జిల్లాలోని రామ్ గడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడారు. జేఎన్ యూ గురించి గతంలో తాను చెప్పిన విషయాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజూ 2,000 మద్యం సీసాలు, 10,000 సిగరెట్ పీకలు, 4,000 బీడీ ముక్కలు, 50,000 తినిపారేసిన ఎముకల ముక్కలు, 2,000 చిప్స్ కవర్లు, 3,000 వాడిపారేసిన కండోమ్స్ కనపడుతుంటాయని ఇటీవల నిర్వహించిన ఒక ర్యాలీలో ఆయన వ్యాఖ్యానించారు. కాగా, రాజస్థాన్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజునే అహుజా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు తమ నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News