: రైళ్లలో ఇకపై ప్రయాణికుల అభి'రుచి' మేర భోజనం!
రైళ్లలో ఇకపై రుచికరమైన భోజనం లభించనుంది. రైల్వేలలో కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ-కేటరింగ్ విధానం ద్వారా 1350 రైల్వే స్టేషన్లలో ఇండియన్ రైల్వే, టూరిజం శాఖలు సంయుక్తంగా ప్రయాణికులు మెచ్చేవిధంగా భోజనం సరఫరా చేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ విధానంలో కేఎఫ్ సీ, ఫుడ్ పాండా, డొమినోస్, బిట్టూ, టిక్కీవాలా మొదలగు సంస్థల ద్వారా ఆహారం సరఫరా చేయనున్నామని రైల్వే శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలను 180011321 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ఈ సర్వీసు ద్వారా కొనుగోలు చేసిన ఆహారంలో నాణ్యత, సరఫరాలో లోపాలపై 138కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.