: ఒరిస్సా ఎమ్మెల్యేపై వేధింపుల కేసు నమోదు
ఒరిస్సాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే శాంతన్ మహాకుడ్ పై వేధింపుల కేసు నమోదైంది. తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఆయన కోడలు కవితా మహాకుడ్ భువనేశ్వర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన భర్త పంకజ్, మరిది దీనాబాబు బారిక్ ల పై కూడా ఆమె ఆరోపణలు చేసింది. తన భర్తను బలవంతంగా తనకు దూరం చేశారని, ఆయనకు రెండో పెళ్లి చేశారని ఆమె వాపోయింది. తమది ప్రేమ వివాహమని, తమకు ఒక కుమార్తె కూడా ఉందని కవిత తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా పోలీసు కమిషనర్ వైబీ ఖురానియా ఆదేశించారు. కాగా, తనపై కోడలు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే కొట్టిపారేశారు.