: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డ బీసీసీఐ
ధర్మశాల వేదికగా నిర్వహించనున్న భారత్-పాక్ మ్యాచ్ కు భద్రత కల్పించడం తమ వల్ల కాదని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీట్వంటీ వరల్డ్ కప్ నిర్వహణ ఏడాది క్రిందటే ఖరారైందని, అరు నెలల క్రిందటే షెడ్యూల్ ను ఖరారు చేశామని, అప్పుడే ధర్మశాల వేదికగా భారత్-పాక్ మ్యాచ్ ను నిర్వహించనున్నామని ప్రభుత్వానికి తెలుసని ఆయన చెప్పారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని ఆయన అడిగారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పుడే చెప్పాల్సిందని, టికెట్లు విక్రయించిన తరువాత భద్రత కల్పించలేమని కాంగ్రెస్ పాలనలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంలో ఆంతర్యం ఏంటని ఆయన నిలదీశారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు సరికాదని ఆయన హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల భారతదేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. దక్షిణాసియా గేమ్స్ సందర్భంగా పాకిస్థాన్ క్రీడాకారులకు అసోం ప్రభుత్వం భద్రత కల్పించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.