: ప్రీతి జింటాకి పెళ్లైపోయిందా?


బాలీవుడ్ నటి, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా వివాహం జరిగిందా? అంటే అవుననే బాలీవుడ్ పేర్కొంటోంది. నెస్ వాడియాతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ప్రీతి జింటా మనస్పర్థల కారణంగా అతనికి టాటా బాయ్ బాయ్ చెప్పేసింది. అనంతరం అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్ గుడ్ ఇనోతో ప్రేమలో పడింది. వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారంటూ గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీటిపై మండిపడ్డ ప్రీతి తన వివాహం రహస్యంగా జరిగే అవకాశం లేదని పేర్కొంది. అయితే నెస్ వాడియాతో వివాదం నేపథ్యంలో ఆమె రహస్యంగా వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రియుడిని అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. లాస్ ఏంజిలెస్ లో నిన్న అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివాహానికి ప్రీతి స్నేహితులు సుజాన్నే ఖాన్, సురిలీ గోయల్ హాజరయ్యారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News