: రష్యాలో దారుణం... చిన్నారి తలనరికి 'నేను ఉగ్రవాదిని' అని అరుస్తూ వీధుల్లో తిరిగిన మహిళ!


బురఖా ధరించి ఓ నాలుగేళ్ల బాలిక తలను చేత్తో పట్టుకుని మాస్కో వీధుల్లోకి వచ్చిన ఓ మహిళ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. చిన్నారి తలను పట్టుకుని వచ్చిన ఉజ్బెకిస్థాన్ జాతీయురాలు గ్యుల్చెహ్రా బొబొకులోవా (38) అనే మహిళ, వీధుల్లో తిరుగాడుతూ 'అల్లాహు అక్బర్', 'నేను ఉగ్రవాదిని' అని అరుస్తూ తిరిగింది. ఈ ఉదంతం మొత్తాన్నీ అక్కడున్న ఓ వ్యక్తి వీడియో కూడా తీశాడు. "ఎందుకు మీరింత కఠినంగా ఉన్నారు. మాలో ఎంతమందినో చంపారు. చూడండి నేను ఆత్మాహుతి దళ సభ్యురాలిని. నేను చచ్చిపోతాను. భూమి అంతం మరో క్షణంలో వచ్చేస్తుంది" అని ఆమె కేకలు పెడుతుంటే, చుట్టు పక్కల వారు పరుగు పెట్టడం కనిపిస్తోంది. కాగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు రావడం చూసిన ఆమె మోకాళ్లపై కూర్చుని ప్రార్థన ప్రారంభించిందట. ఆమెను తమ ఇంట్లో పనిమనిషిగా ఏడాదిన్నర క్రితం పెట్టుకున్నామని, తమ బిడ్డను ఇలా చంపుతుందని ఊహించలేదని బాలిక తండ్రి వాపోయాడు.

  • Loading...

More Telugu News