: మలుపు తిరిగిన షారూక్ 'ఫ్యాన్' కథ... ఒక్క రోజులో 11 లక్షల వ్యూస్!


షారూక్ ఖాన్ తాజా చిత్రం 'ఫ్యాన్' రెండో అఫీషియల్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. నిన్న ఈ ట్రైలర్ ను విడుదల చేయగా, ఒక్కరోజులో దాదాపు 11.5 లక్షల మంది దీన్ని వీక్షించారు. తొలి ట్రైలర్ లోనే ఈ చిత్రంలో షారూక్, ఓ బాలీవుడ్ స్టార్ ఆర్యన్ ఖన్నాగా, ఆయన్ను విపరీతంగా అభిమానించే ఫ్యాన్ గౌరవ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న సంగతి బయటకు రాగా, రెండో ట్రైయిలర్ లో సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది. ఆ విలన్ కూడా ఎవరో కాదు, షారూకే...! తన అభిమాన నటుడిని కలవాలన్న గౌరవ్ ప్రయత్నాలు, ఆపై ఇద్దరి మధ్యా విభేదాలు, వారిద్దరి పోరాటాలను ఈ ట్రైలర్ లో టేస్ట్ చూపించారు. ఇక గౌరవ్ పాలిట ఆర్యన్ విలనా? లేక ఆర్యన్ పాలిట గౌరవ్ విలన్ గా మారాడా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్!

  • Loading...

More Telugu News