: టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం... సెంటరాఫ్ అట్రాక్షన్ గా నారా లోకేశ్


తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట మాజీ సీఎం దివంగత నందమూరి తారకరామారావు స్థాపించిన ‘తెలుగుదేశం పార్టీ’ త్వరలోనే 34 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ నెల 29తో ఆ పార్టీకి 34 ఏళ్లు నిండనున్నాయి. ఈ క్రమంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించుకునేందుకు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలంతా హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన పార్టీ నేతలకు స్వయంగా ఆహ్వానాలు పలుకుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వెరసి సమావేశంలో ఆయన సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

  • Loading...

More Telugu News