: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మావోలకు భారీ దెబ్బ... మృతుల్లో అగ్రనేతలు జగన్, హరికిరణ్?
ఛత్తీస్ గఢ్ లోని బిజాపూర్ జిల్లా గొట్టెపాడు అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో నిషేధిత మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బే తగిలినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్- చర్ల సరిహద్దులో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులుండగా, మిగిలిన ముగ్గురు పురుషుల్లో మావోయిస్టులకు చెందిన కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. వీరిలో దండకారణ్య కమిటీ కార్యదర్శి జగన్ తో పాటు తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరికిరణ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అటు మావోయిస్టులతో పాటు పోలీసుల్లోనూ కలకలం రేగింది. మావోయిస్టు కీలక నేతలున్నట్లు వస్తున్న సమాచారంతో మృతులను గుర్తించే పనిని పోలీసులు ముమ్మరం చేశారు.