: వైసీపీలో మరో వికెట్ పడింది... టీడీపీలో చేరుతున్నట్లు పాతపట్నం ఎమ్మెల్యే ప్రకటన
సొంత జిల్లాతో పాటు రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రాల్లో గట్టి ఎదురు దెబ్బలు తగిలిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాజాగా ఉత్తరాంధ్రలో షాక్ కొట్టింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తాను టీడీపీలో చేరుతున్నట్లు కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. గతంలో పదేళ్ల పాటు టీడీపీలోనే ఉన్న తాను అనుకోని పరిస్థితుల కారణంగా వైసీపీలో చేరానని ఆయన పేర్కొన్నారు. తాజాగా నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాను తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లు కలమట ప్రకటించారు. ఈ నెల 4న తాను టీడీపీలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలమట షాక్ తో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 60కి పడిపోయింది. మొన్న విడతలవారీగా ఆరుగురు వైపీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.