: తొలి యాక్సిడెంట్ చేసిన గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్ సంస్థ తయారు చేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు తొలి యాక్సిడెంట్ కు గురైంది. సిలికాన్ వ్యాలీ వీధుల్లో ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఈ కారు ఓ పబ్లిక్ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, కారులో వాడిన సాంకేతికతపై మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రమాదానికి తామే కారణమని గూగుల్ వెల్లడించింది. ఈ కారు ముందు, ఎడమ పక్కన వాహనాలు వెళుతుండటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. పక్కనే ఇసుక, ఓ చిన్న కాలువ కనిపించడంతో కారు కుడివైపునకు టర్న్ తీసుకోవడంతో ప్రమాదం జరిగినట్టు గూగుల్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు 3 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News