: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... 8 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు జరిపిన మెరుపు దాడిలో నిషేధిత మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏకంగా 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. వివరాల్లోకెళితే... ఛత్తీస్ గఢ్- చర్ల సరిహద్దు ప్రాంతంలోని గొట్టెపాడు అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి కూంబింగ్ కు వెళ్లిన పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య సుదీర్ఘంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసులు 8 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఏకే47 రైఫిల్ సహా పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.