: ‘హీరో’గా ఆఫర్ అయితే వచ్చింది!... కానీ వద్దన్నా!: ‘సూపర్ హీరోస్’పై సీఎం మనవడు హిమాన్షు
‘హీరో’గా వచ్చిన అవకాశాన్ని తెలంగాణ సీఎం మనవడు (కేటీఆర్ కొడుకు) హిమాన్షురావు తిరస్కరించాడట. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న షార్ట్ ఫిల్మ్ ‘సూపర్ హీరోస్’లో హిమాన్షు నటిస్తున్నాడని నిన్న వార్తలు వచ్చాయి. మొన్న జరిగిన చిత్రం ప్రారంభోత్సవానికి అనారోగ్యం కారణంగానే హాజరుకాలేకపోయిన హిమాన్షు, ఈ నెల 22 నుంచి జరిగే షూటింగ్ కు హాజరుకానున్నాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఓ పత్రిక ప్రతినిధికి నిన్న ఫోన్ చేసిన హిమాన్షు... ఆఫర్ అయితే వచ్చింది కానీ, తానే వద్దన్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం చదువు, పరీక్షలపైనే దృష్టి పెట్టినట్లు అతడు వెల్లడించాడు.