: పాకిస్థాన్ ను పరేషాన్ చేసిన యూఏఈ ఆటగాడు!


పాకిస్థాన్ ను యూఏఈ ఆల్ రౌండర్ అంజాద్ జావెద్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టులో కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 27 పరుగులు పిండుకున్న అంజాద్ జావెద్, బౌలింగ్ విషయంలో కూడా చెలరేగాడు. పాకిస్థాన్ టాపార్డర్ నడ్డి విరిచాడు. 130 పరుగుల విజయలక్ష్యంతో పాకిస్థాన్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ షెర్జీల్ ఖాన్ ను జావెద్ బోల్తా కొట్టించి ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఖుర్రం మజూర్ (0)ను వెంటనే పెవిలియన్ కు పంపాడు. మరో ఓపెనర్ హఫీజ్ (11) నిలదొక్కుకుంటున్నాడని భావించే లోపు అతనిని మరో చక్కని బంతితో జావెద్ పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో పాకిస్థాన్ అభిమానుల్లో ఆందోళన రేగింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పాక్ సీనియర్లు ఉమర్ అక్మల్ (2), షోయబ్ మాలిక్ (6) జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో 6 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో జావెద్ మూడు వికెట్లతో రాణించాడు.

  • Loading...

More Telugu News