: అక్క విజయాలు చూస్తే గర్వంగా ఉంది!: పరిణీతి చోప్రా
తన సోదరి విజయాలు చూస్తుంటే గర్వంగా ఉన్నప్పటికీ, మరోపక్క భయంగా ఉంటుందని బాలీవుడ్ యువనటి పరిణీతి చోప్రా తెలిపింది. ప్రియాంకా చోప్రా ఆస్కార్ వేదికపై వ్యాఖ్యాతగా నిలబడడం, విజేతకు అవార్డు బహూకరించడంపై స్పందన కోరగా, దీనిపై ఆమె కంటే తనకే ఎక్కువ ఆందోళన, ఆనందంగా ఉన్నాయని చెప్పింది. 'ఇన్నేళ్ల నటజీవితంలో ఆమె సాధించిన విజయాలు చూస్తుంటే ఒక్కోసారి నాకే భయంగా ఉంటుంది. హాలీవుడ్ లో పేరుతెచ్చుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అందులోనూ భారతీయులకైతే అది మరింత కష్టంతో కూడుకున్న వ్యవహారం' అని చెప్పింది. ప్రతిభతో అవకాశాలు సంపాదించుకుని హాలీవుడ్ లో పేరుతెచ్చుకుంటున్న ప్రియాంకా చోప్రాను చూస్తే గర్వంగా ఉందని తెలిపింది. హాలీవుడ్ లో అవకాశం వస్తే తాను వదులుకోనని పరిణీతి తెలిపింది.